మంత్రి సురేఖకు సమంత స్ట్రాంగ్ కౌంటర్..

ABN, Publish Date - Oct 02 , 2024 | 09:44 PM

తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత(Samantha) స్పందించారు. తాను సినీ ఇండ్రస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. తన విడాకుల అంశం వ్యక్తిగతమని, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు.

హైదరాబాద్: తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత(Samantha) స్పందించారు. తాను సినీ ఇండ్రస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. తన విడాకుల అంశం వ్యక్తిగతమని, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. తన పేరును రాజకీయ పోరాటాలకు వాడుకోవద్దంటూ మంత్రి కొండాకు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీతో ముడిపెడితూ కొండా సురేఖ సమంత విడాకుల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. మంత్రి చేసిన వ్యాఖ్యలను నటుడు నాగార్జున ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. తాజాగా సమంత సైతం ఇన్‌స్టా వేదికగా మంత్రి కొండా సురేఖకు సమాధానం ఇచ్చారు. " స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పని చేయడానికి, స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి, ప్రేమలో నుంచి బయట పడటానికి, ఇంకా నిలబడి పోరాటం చేయడానికి.. వీటన్నింటికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి దీన్ని చిన్నచూపు చూడకండి" అంటూ పోస్టు పెట్టారు.

Updated at - Oct 02 , 2024 | 09:44 PM