జగిత్యాలలో హైటెన్షన్.. లొంగిపోయిన నిందితుడు..

ABN, Publish Date - Oct 22 , 2024 | 02:01 PM

జగిత్యాలలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి. పాత బస్టాండ్ దగ్గర జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయినట్లు సమాచారం.

జగిత్యాలలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి. పాత బస్టాండ్ దగ్గర జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయినట్లు సమాచారం. జగిత్యాల మండలం, జాబితాపూర్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డిని తెల్లవారు జామున హత్య చేశారు. ఇంటికి వెళుతుండగా దుంగులు కారుతో ఢీ కొట్టి కత్తితో దాడి చేశారు.


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన అనుచరులతో జగిత్యాలలోని పాత బస్టాండ్ ఆవరణలో నడి రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కూడా ఆందోళనకు దిగారు. గంగారెడ్డి హత్య జగిత్యాలలో సంచలనం కలిగించింది. ఈ క్రమంలో పాత బస్టాండ్ వైపు వచ్చే వాహనాలన్నింటిని పోలీసులు దారి మళ్లిస్తున్నారు. అలాగే జగిత్యాలయ జిల్లా ఎస్పీ, డీఎస్పీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేస్తున్న ధర్నా ప్రదేశానికి చేరుకుని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇదే డ్రోన్.. ఓ గేమ్ చేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు

హైదరాబాద్: చందానగర్‌లో విషాద ఘటన..

గిరిజన ప్రాంతాల అభివృద్ది, పథకాలపై సమీక్షించిన సీఎం

నేడు కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 22 , 2024 | 02:01 PM