హైదరాబాద్‌లో దారుణ ఘటన..

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:24 PM

స్థానిక బ్లైండ్స్ కాలనీలో కొడుకు చనిపోయాడన్న విషయాన్ని గుర్తించలేని అంధులైన తల్లిదండ్రులు.. కుళ్లిన ఆ మృత దేహంతో ఇంట్లోనే ఉండిపోయారు. మూడు రోజులుగా తిండి, నీళ్లు లేక దీనావస్థలో గడుపుతున్నారు.

హైదరాబాద్: నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. స్థానిక బ్లైండ్స్ కాలనీలో కొడుకు చనిపోయాడన్న విషయాన్ని గుర్తించలేని అంధులైన తల్లిదండ్రులు.. కుళ్లిన ఆ మృత దేహంతో ఇంట్లోనే ఉండిపోయారు. మూడు రోజులుగా తిండి, నీళ్లు లేక దీనావస్థలో గడుపుతున్నారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుప్రక్కలవాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి.. ఆకలి, దుర్వాసన మధ్య మగ్గిపోతున్న అంధ దంపతులను బయటకు తీసుకువచ్చారు. వారికి సపర్యాలు చేసి ఆహారం, నీళ్లు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మృత దేహన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్తుల వివాదంపై అనిల్ ఏమన్నారంటే..

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

హైద్రాబాద్‌లో 163 సెక్షన్ అమలు

బయటపడుతున్న జగన్ అక్రమాలు..

మద్యం వ్యాపారులకు సీఎం కీలక ఆదేశాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 29 , 2024 | 12:24 PM