‘జగన్ చేతికి ఆ విజువల్స్ ఎలా వచ్చాయి..’
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:16 PM
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారని.. అలాగే వైఎస్సార్సీపీ హయాంలో కూటమి నేతలపై జరిగిన దారుణాలపై కమిటీవేసి విచారణ జరపాల్సిన అవసరం ఉందని జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తర సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా జరుగుతున్న ప్రశ్నత్తర సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన దానిపై జరుగుతున్న చర్చలో భాగంగా ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్కిల్ కేసు పేరుతో చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజులు జైల్లోపెట్టారని.. జైల్లో ఉన్న సీసీ కెమెరాల పాశ్వర్డ్లు జగన్‌కు ఇచ్చారని.. ఆ ఫోటోలను సాక్షి టీవీలో చూపించారని.. ఇవన్నీ ఎలా జరిగాయి.. జగన్ చేతికి ఆ విజువల్స్ ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
అప్పటి డీఐజీ రవికిరణ్ రెడ్డి నేతృత్వంలో జరిగిందని.. రాజకీయ ముసుగులో జరిగిన దాన్ని వెలికితీయాలని, దీని వెనుక ఉన్న క్రిమినల్స్‌ను బయటపెట్టాల్సిన అవసరం ఉందని బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పవన్ కల్యాణ్‌ను వైజాగ్‌లో అడ్డుకోవడం, అచ్చెన్నాయుడు అరెస్టు, రఘురామ కృష్ణంరాజును జైల్లో కొట్టిన వీటన్నింటిపై కమిటీ వేసి విచారణ జరపాలని ఆయన సభను కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెవులోపువ్వులుపెట్టుకున్నామా..: బొత్స
అదానీకి చెందిన హైడ్రో వద్ద ఆందోళన
‘నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి’
గంటన్నరపాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకున్న గుండె..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 20 , 2024 | 01:16 PM