చెరువుల ఆక్రమణతో ప్రజలకు పెను ప్రమాదం

ABN, Publish Date - Oct 07 , 2024 | 09:09 PM

హైదరాబాద్ అంటనే.. రాక్స్, లేక్స్, పార్క్స్ అని ఆయన ఈ సందర్భంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. అలాగే నగరానికి మూసి నది మణిహారంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

తెలంగాణలో నాలాలు, చెరువులు అక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. అందులోభాగంగా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ హైడ్రాపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం హైదరాబాద్‌లో స్పందించారు. హైడ్రా పేరుతో తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలపై ఆయన మండిపడ్డారు. హైడ్రాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.


హైదరాబాద్ అంటనే.. రాక్స్, లేక్స్, పార్క్స్ అని ఆయన ఈ సందర్భంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. అలాగే నగరానికి మూసి నది మణిహారంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. నగరంలో చాలా చెరువులు, పార్కులు, కబ్జాకు గురయ్యాయన్నారు. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ కోసం గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ గుర్తు చేశారు.

Updated at - Oct 07 , 2024 | 09:09 PM