Home » Revanth Reddy
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. గాడ్సే వారసులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. గాంధీ వారసులకు, గాడ్సే వారసుల మధ్య రాజకీయ పోరాటం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
KTR:హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హెచ్‌సీయూలో ఫుల్ బాల్ ఆడేందుకు వెళ్లి.. ఆ భూములపై ఆయన కన్ను పడిందన్నారు.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..కేటీఆర్‌పై ఫన్నీ కామెంట్లు చేశారు. నేపాల్ యువరాజు దేపేంద్ర సంఘటనను గుర్త చేస్తూ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. కేటీఆర్ ఇంగ్లీష్ పరిజ్ణానం గురించి క్లాస్ పీకారు.
KTR: రైతు బంధు పథకం సరైన రీతిలో అమలు కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏక్కడైనా 100 శాతం ఈ పథకం అమలు అయిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. అందుకోసం కొడంగల్ లేకుంటే సిరిసిల్లలో పర్యటిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాయిస్ ఇచ్చారు.
తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ప్రచారంలో నిజానిజాలేంటో తేల్చేశారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ.50 వేలలోపు యూనిట్‌కు 100% రాయితీతో సహా వివిధ వివరాలతో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది
సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ప్రతి రోజూ, ప్రతి నిమిషం కాంగ్రెస్, బీఆర్ఎస్ బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తుంటాయి.
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42శాతానికి పెంచాలని రెండు బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త స్పందించారు. ఆర్యవైశ్యుల డిమాండ్స్ నెరవేర్చకపోతే ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామన్నారు.ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం చూడాలన్నారు.
CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు కలిసి రావాలని అన్ని రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఆ క్రమంలో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు సైతం తమతో కలిసి రావాలన్నారు.