పాక్ నౌకను ఛేజ్ చేసిన ఐసీజీ నౌక..
ABN, Publish Date - Nov 19 , 2024 | 12:23 PM
తమకు సాయం చేయాలని కోరుతూ భారత మత్స్యకారుల బోటు ‘కాల భైరవ్’ నుంచి ఐసీజీకి సమాచారం వచ్చింది. పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక తమను అడ్డుకుందని జాలర్లు తెలిపారు. అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారులను పాక్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో..
ABN Internet: అరేబియా సముద్రంలో పాకిస్థాన్ అధికారుల చెరనుంచి ఏడుగురు భారత మత్స్యకారులను కోస్ట్‌గార్డ్ (Indian Coast Guard) రక్షించింది. పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌకలో మత్స్యకారులను తరలిస్తుండగా.. ఛేజ్ చేసి అడ్డుకుంది. ‘నో ఫిషింగ్ జోన్’ సమీపంలో మత్స్యకారుల నుంచి ఈ మేరకు సమాచారం అందడంతో హుటాహుటిన రంగంలోకి దిగి వారిని సురక్షితంగా విడిపించింది.
తమకు సాయం చేయాలని కోరుతూ భారత మత్స్యకారుల బోటు ‘కాల భైరవ్’ నుంచి ఐసీజీకి సమాచారం వచ్చింది. పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక తమను అడ్డుకుందని జాలర్లు తెలిపారు. అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారులను పాక్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో.. భారత కోస్ట్‌గార్డ్ బృందం రంగంలోకి దిగింది. భారత్-పాక్ మారిటైమ్ సరిహద్దుకు ఓ నౌకను వెంటనే పంపించింది. పీఎంఎస్‌ఏ నౌక పాక్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఐసీజీ నౌక దానిని వెంబడించి అడ్డుకుంది. చివరకు పాక్ అధికారుల చెరనుంచి ఏడుగురు భారత మత్స్యకారులను క్షేమంగా విడిపించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కొన్ని లక్షల మందికి మేలు జరిగింది: ఎమ్మెల్యే కోటం రెడ్డి
విచారణకు రాలేను.. వారం రోజుల గడువు కావాలి: రాంగోపాల్ వర్మ
నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-20 ఉపగ్రహం..
అసెంబ్లీలో మంగళవారం ఏయే బిల్లులు ప్రవేశపెట్టనున్నారంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 19 , 2024 | 12:23 PM