అల్లు అర్జున్ సంచలన ప్రెస్ మీట్..
ABN, Publish Date - Dec 21 , 2024 | 08:53 PM
సంధ్యా థియేటర్ ఘటనలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖండించారు. బాధిత కుటుంబాన్ని కలవాలని తనకు ఉందని, కానీ కేసు కోర్టులో ఉన్నందు వల్ల వెళ్లలేకపోతున్నట్లు బన్నీ చెప్పారు. ఆ రోజు జరిగిన ఘటన ఒక యాక్సిడెంట్, ఇందులో ఎవ్వరీ తప్పూ లేదని ఆయన చెప్పారు.
హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటనలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖండించారు. బాధిత కుటుంబాన్ని కలవాలని తనకు ఉందని, కానీ కేసు కోర్టులో ఉన్నందు వల్ల వెళ్లలేకపోతున్నట్లు బన్నీ చెప్పారు. ఆ రోజు జరిగిన ఘటన ఒక యాక్సిడెంట్, ఇందులో ఎవ్వరీ తప్పూ లేదని ఆయన చెప్పారు. పుష్ప-2 టీమ్ మంచి ఉద్దేశంతోనే సినిమా ప్రమోట్ చేయడానికి వెళ్లామని, కానీ అనుకోకుండా తొక్కిసలాట జరిగిందని అల్లు అర్జున్ తెలిపారు. ఇది పూర్తిగా ఓ ప్రమాదమని, ఎవ్వరూ కావాలని చేసిందని కాదని అర్జున్ చెప్పారు. సంధ్యా థియేటర్ ఘటన బాధాకరమని, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, క్షమాపణ తెలియజేస్తున్నట్లు చెప్పారు. బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ఘటనపై మిస్ ఇన్‌ఫర్మేషన్, మిస్ కమ్యూనికేషన్ జరుగుతోందని అల్లు అర్జున్ తెలిపారు. థియేటర్ ఘటనలో తన క్యారెక్టర్‌ను కించపరిచారని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వహననం జరిగిందని, కొందరి వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించినట్లు బన్నీ చెప్పారు. పుష్ప-2 సినిమా హిట్టయినా తాను 15 రోజులుగా ఇంట్లోనే కూర్చుని బాధపడుతున్నట్లు తెలిపారు. అయినా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
Updated at - Dec 21 , 2024 | 08:53 PM