చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు..
ABN, Publish Date - Oct 08 , 2024 | 09:46 PM
భారీగా పెరిగిన కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దసరా పండగ నేపథ్యంలో ధరలు మరింతగా పెరిగి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఉల్లి, టమాటా సహా ఏ కూరగాయలు కొందామన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విజయవాడ: భారీగా పెరిగిన కూరగాయల ధరలు(Vegetables Price) సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దసరా(Dussehra) పండగ నేపథ్యంలో ధరలు మరింతగా పెరిగి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ఉల్లి, టమాటా సహా ఏ కూరగాయలు కొందామన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిల్లర మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.100లు పలుకుతుండడం, అలాగే మిలిగిన కూరగాయల రేట్లు సైతం ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలా అయితే బతికేది ఎలా అంటూ పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూరగాయల రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోని ఓ కూరగాయల మార్కెట్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి వినియోగదారులతో మాట్లాడారు. సామాన్య ప్రజలు కూరగాయల రేట్లపై ఏ విధంగా స్పందించారో ఇప్పుడు చూద్దాం..
Updated at - Oct 08 , 2024 | 09:46 PM