ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు రెడీ

ABN, Publish Date - Jan 08 , 2024 | 11:32 AM

హైదరాబాద్: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సాయం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం... ఆ ఇళ్లను ఏ నమూనాలో నిర్మించాలో కూడా చెప్పనుంది.

హైదరాబాద్: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సాయం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం... ఆ ఇళ్లను ఏ నమూనాలో నిర్మించాలో కూడా చెప్పనుంది. ఇందు కోసం గృహ నిర్మాణం శాఖ అధికారులు మూడు రకాల ఇళ్ల నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. వేర్వేరు కొలతలతో రూపొందించిన ఈ మూడు డిజైన్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో ప్రభుత్వం ఏదో ఒక దానిని ఎంపిక చేస్తుందా? లేక మూడు డిజైన్లను ఎంపిక చేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 08 , 2024 | 11:35 AM