నా ఉద్యోగం నాకివ్వండి: ప్రవీణ్ ప్రకాష్

ABN, Publish Date - Aug 21 , 2024 | 08:50 AM

అమరావతి: వివాదాస్పద సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీతో అంటకాగిన ఆయనను జీఏడీకి సరెండర్‌ చేసింది.

అమరావతి: వివాదాస్పద సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీతో అంటకాగిన ఆయనను జీఏడీకి సరెండర్‌ చేసింది. దీంతో తాను స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మూడు నెలల ముందస్తు నోటీసు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు జూన్‌ 25న లేఖ సమర్పించారు. సెప్టెంబరు 30తో నోటీసు గడువు ముగిసేలోగా ఆయన వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉంది. అయితే వారం రోజుల వ్యవధిలోనే ఆయన వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం అనూహ్యంగా జీవో జారీ చేసింది.


ఆ జీవో సెప్టెంబరు 30 తర్వాత ఆమలులోకి వస్తుందని పేర్కొంది. దీంతో ఆ తేదీ వరకూ ఆయన రాష్ట్రంలోనే ఉండాలి. కానీ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వదు. ఇదిలా ఉండగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. వీఆర్‌ఎస్‌ దరఖాస్తును వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఆయన సీఎస్‌ కార్యాలయానికి సంకేతాలు పంపుతున్నారు. వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో తాను ఒత్తిడిలో ఉన్నానని, ప్రభుత్వం కూడా వెంటనే దాన్ని ఆమోదించిందని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇక తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ప్రవీణ్‌ ప్రకాశ్‌ దరఖాస్తు చేస్తారని సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

కోల్‌కతా కేసుపై సుప్రీం కోర్టు సీరియస్..

సీఐడీ విచారణకు జోగి రమేష్ డుమ్మా ..

హైదరాబాద్‌లో వాన దడ

తాడిపత్రిలో హైటెన్షన్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 21 , 2024 | 08:50 AM