జగన్‌కు రూ. 3100 కోట్ల ముడుపులు..

ABN, Publish Date - Dec 09 , 2024 | 12:11 PM

రాష్ట్ర స్థాయిలో వైసీపీ పెద్దలు దున్నేయగా... జిల్లాల స్థాయిలో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు కుమ్మేశారు. జగన్‌ ‘ఘనత’ రాష్ట్రం, దేశ సరిహద్దులు దాటి ఖండాంతరాలకు చేరగా... ఆయన పార్టీ నేతలు తమకు చేతనైనంతగా చెలరేగిపోయారు. గత ఐదేళ్లలో ఒక్క మద్యంలోనే తాడేపల్లికి రూ. 3,100 కోట్ల ముడుపులు అందగా...

అమరావతి: రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహల్ మండలం, కులకర్తికి చెందిన రైతు రామాంజనేయులు రెడ్డికి చెందిన రూ. కోటి విలువైన 11 ఎకరాల భూమిని అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన బినామీల పేరుతో సొంతం చేసుకున్నారు. ఆ రైతు ఆయన కుమారుడిని ఎస్సీ, ఎస్టీ కేసులో పేరుతో బెదిరించారు. రౌడీ షీటు ఓపెన్ చేయించి నానా ఇబ్బందులకు గురి చేశారు.


అప్పటి ఎమ్మెల్యే కిలారీ వెంకట రోశయ్య అండదండలతో మట్టి మాఫియా చెలరేగిపోయింది. చేబ్రోలు మండలంలో నాణ్యమైన ఎర్ర గ్రావెల్ భూములను అడ్డగోలుగా చేజిక్కించుకుని అక్రమార్జనకు తెరతీశారు. 2 వందల ఎకరాల్లో పండ్ల తోటలను కనుమరుగు చేశారు. వీరనాయకుని పాలెం గ్రామంలో దశాబ్దాల క్రితం ప్రభుత్వం దళితులకు ఇచ్చిన అసైన్డ్ పంట భూముల్లో పాగా వేసి దళితులను తరిమేసి.. ఎదురుకేసిపెట్టి మట్టి తవ్వకాలు సాగించారు.


రాష్ట్ర స్థాయిలో వైసీపీ పెద్దలు దున్నేయగా... జిల్లాల స్థాయిలో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు కుమ్మేశారు. జగన్‌ ‘ఘనత’ రాష్ట్రం, దేశ సరిహద్దులు దాటి ఖండాంతరాలకు చేరగా... ఆయన పార్టీ నేతలు తమకు చేతనైనంతగా చెలరేగిపోయారు. గత ఐదేళ్లలో ఒక్క మద్యంలోనే తాడేపల్లికి రూ. 3,100 కోట్ల ముడుపులు అందగా... కింది స్థాయి నేతలూ అధికారం అండతో కోట్లకు పడగలెత్తారు. అడ్డగోలుగా జనమ్మీద పడి దోచుకున్నారు. ప్రకృతి వనరులను చెరబట్టారు. ప్రతి పనిలోనూ వాటాలు, ముడుపులు పిండుకున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ భూములు అన్నతేడా లేకుండా బెదిరించి మరీ వేలాది ఎకరాలు సొంతం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కుక్కల విద్యాసాగర్‌కు షరతులతో కూడిన బెయిల్

ABN Live: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా ప్రత్యేకతలు.. ఏంటంటే..

నందికొట్కూరు బైరెడ్డినగర్‌లో దారుణం

తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకున్న రాజకీయం

మనోజ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్న పోలీసులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 09 , 2024 | 12:13 PM