అదానీ లంచాల యాత్ర ఇరుక్కున్న జగన్
ABN, Publish Date - Nov 22 , 2024 | 08:13 AM
భారత సౌర విద్యత్ సంస్థ రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్‌ను అప్పట్లో అదానీ గ్రూప్ దక్కించుకుంది. అయితే అదానీ కోడ్ చేసిన ధరను చూసి డిస్కమ్‌లు బెంబేలెత్తాయి. ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి రాలేదు. దీంతో అదానీ గ్రూప్ లంచాల యాత్ర మొదలుపెట్టింది.
భారత దేశంలో రెండో అతి పెద్ద సంపన్నుడైన గౌతమ్ అదానీ భారీ సంక్షోభంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డంపెట్టుకుని రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం 2021-24 మధ్య కాలంలో అప్పటి ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంతో సహా ఐదు రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రూ. 2,029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సంచలన ప్రకటన చేసింది. అందులో రూ. 1750 కోట్లు అప్పటి ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది.
భారత సౌర విద్యత్ సంస్థ రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్‌ను అప్పట్లో అదానీ గ్రూప్ దక్కించుకుంది. దీని ప్రకారం రాష్ట్రాల డిస్కమ్‌లు సెకీతో ఒప్పందం చేసుకుంటే అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్‌ను సరఫరా చేస్తారు. అయితే అదానీ కోడ్ చేసిన ధరను చూసి డిస్కమ్‌లు బెంబేలెత్తాయి. ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి రాలేదు. అవి కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేరు... సొమ్ములు సంపాదించలేరు. ఫ్లాంట్ల ఏర్పాటుపేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి.. పెట్టుబడులు సమీకరించడంతో అదానీపై ఒత్తిడి బాగా పెరిగింది. దీంతో అదానీ గ్రూప్ లంచాల యాత్ర మొదలుపెట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అదానీపై కేసు.. తాడేపల్లి ప్యాలెస్‌కు సెగ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 22 , 2024 | 08:19 AM