సీఆర్డీయే ఆఫీస్‌లో కీలక ఫైళ్లు మాయం..

ABN, Publish Date - Aug 04 , 2024 | 10:01 AM

అమరావతి: రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ కార్యాలయంలో ( పలు కీలక ఫైల్స్‌ కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వ తప్పులను పట్టుకుని, కేసులు పెట్టేందుకు సీఆర్‌డీఏ ఫైల్స్‌ను అణువణువూ శోధించింది. విచారణ కోసం పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. వీటిలో కొన్ని కీలక ఫైళ్లు ఇప్పటికీ కనిపించడం లేదు. దీంతో సీఆర్‌డీఏ పాలనా వ్యవహారాలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

అమరావతి: రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (CRDA) కార్యాలయంలో (Office) పలు కీలక ఫైల్స్‌ కనిపించడం లేదు (Key File Missing). వైసీపీ ప్రభుత్వ (YCP Govt.) హయాంలో టీడీపీ ప్రభుత్వ (TDP Govt.,) తప్పులను పట్టుకుని, కేసులు పెట్టేందుకు సీఆర్‌డీఏ ఫైల్స్‌ను (CRDA Files) అణువణువూ శోధించింది. విచారణ కోసం పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. వీటిలో కొన్ని కీలక ఫైళ్లు ఇప్పటికీ కనిపించడం లేదు. దీంతో సీఆర్‌డీఏ పాలనా వ్యవహారాలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అమరావతి రాజధాని పనుల పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కీలక వ్యవహారాలపై ముందుకు వెళ్లేందుకు సీఆర్‌డీఏ అధికారులకు ఇబ్బందిగా మారింది. ఫైళ్లు కనిపించని విషయం మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ దృష్టికి కూడా వెళ్లింది. ఇంజనీరింగ్‌, ప్లానింగ్‌, రెవెన్యూ, ఎస్టేట్‌ ఇలా పలు విభాగాల ఫైల్స్‌ కనిపించడం లేదు. ఈ ఫైళ్లను టీడీపీ ప్రభుత్వంపై విచారణ పేరుతో వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన వైసీపీ నేతలు..

అప్పుడు తోడేశారు.. ఇప్పుడు తరలిస్తున్నారు..

నదుల అనుసంధానంపై కేంద్రం కీలక నిర్ణయం..

ఓ కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి కాపాడిన ఆర్మీ

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 04 , 2024 | 10:01 AM