కిలాడీ లేడీ..మాయ మాటలతో మోసం..

ABN, Publish Date - Sep 25 , 2024 | 12:53 PM

పోలీస్ స్టేషన్‌కు బాధితులు క్యూ కట్టారు. ఈ కిలాడీ లేడి ప్రభావతి వలలో చిక్కుకుని చాలా మంది భారీగా సొమ్ములు సమర్పించుకున్నారు. గతంలో విజయవాడలోని బ్యాంక్ మేనేజర్‌గా.. గంగూరు బ్రాంచ్‌లో పనిచేసి అవినీతి ఆరోపణతో ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత రాజకీయ నాయకులు, పలువురు మంత్రులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయని నిరుద్యోగులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతోంది.

విజయవాడ: ఆమె గతంలో ఓ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేసింది. అక్కడ అవినీతికి పాల్పడి ఉద్యోగం పోగోట్టుకుంది. ఆ తర్వాత జనాలను మోసం చేస్తూ డబ్బు సంపాదించడాన్ని వృత్తిగా మార్చుకుంది. ఆ లేడీపై పోలీసులు ఏకంగా రౌడీ షీటు ఓపెన్ చేశారంటే.. ఆమె మోసాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. డబ్బులున్న వ్యక్తులే ఆమె టార్గెట్.. మాయమాటలతో వలలోకి దించి వీడియోలు తీస్తుంది. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తుంది.


పోలీస్ స్టేషన్‌కు బాధితులు క్యూ కట్టారు. ఈ కిలాడీ లేడి ప్రభావతి వలలో చిక్కుకుని చాలా మంది భారీగా సొమ్ములు సమర్పించుకున్నారు. గతంలో విజయవాడలోని బ్యాంక్ మేనేజర్‌గా.. గంగూరు బ్రాంచ్‌లో పనిచేసి అవినీతి ఆరోపణతో ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత రాజకీయ నాయకులు, పలువురు మంత్రులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయని నిరుద్యోగులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతోంది. ఆమె స్వస్థలం కృష్ణాజిల్లా, నూజివీడులోని మర్రిబంధం గ్రామం. ప్రభావతి పేరు చెప్పగానే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. మర్రిబంధం, సీతారామపురం గ్రామాల్లో ప్రభావతి బెదిరింపులు, ఆగడాలను తట్టుకోలేకే పలుమార్లు బాధితులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నూజివీడు పోలీస్ స్టేషన్‌లో ఆరు కేసులు నమోదయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గణపతి ఆకారంలో బొప్పాయి పండు..

వరద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం

ప్రభుత్వానికి చెప్పకుండా రూ.159 కోట్లు స్వాహా..

మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు

జగన్ హయాంలోనే ఆ ప్రాజెక్టుకు నష్టం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 25 , 2024 | 12:53 PM