రాష్ట్రపతి దృష్టికి లగచర్ల ఘటన అంశం

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:48 PM

లగచర్లలో బలవంతపు భూసేకరణ, పోలీసుల దాడులు, లైంగిక దాడి వంటి అంశాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేశారు. కాగా లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులపై ఎస్టీ, ఎస్సీ మహిళా మానవ హక్కుల కమిషన్‌లను కలిసిన బాధితులు రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

న్యూఢిల్లీ: లగచర్ల ఘటన అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి వెళ్లింది. లగచర్ల బాధితుల కోసం బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరారు. దీంతో లగచర్లలో గిరిజనులపై అణచివేతకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరారు. లగచర్లలో బలవంతపు భూసేకరణ, పోలీసులు దాడులు, లైంగిక దాడి వంటి అంశాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేశారు.


కాగా లగచర్లలో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులపై ఎస్టీ, ఎస్సీ మహిళా మానవ హక్కుల కమిషన్‌లను కలిసిన బాధితులు రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతిని కలిసి తమ గోడు వినిపించేంతవరకు ఢిల్లీలోనే ఉంటామని గిరిజన మహిళలు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మండలిలో పవన్ కళ్యాణ్ మొదటి స్పీచ్..

‘అందుకే గురుదక్షిణ అని అన్నాం’

పాక్ నౌకను ఛేజ్ చేసిన ఐసీజీ నౌక..

కొన్ని లక్షల మందికి మేలు జరిగింది: ఎమ్మెల్యే కోటం రెడ్డి

విచారణకు రాలేను.. వారం రోజుల గడువు కావాలి: రాంగోపాల్ వర్మ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 19 , 2024 | 01:48 PM