తిరుమలలో మహాశాంతి హోమం

ABN, Publish Date - Sep 23 , 2024 | 10:44 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమం కొనసాగుతోంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు మహాశాంతి యాగాన్ని నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యి దోషాన్ని పోగోట్టేందుకు టీటీడీ అధికారులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని చెపట్టారు. హోమం పూర్తి అయిన తరువాత లడ్డూ పోటుతో పాటు ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాని నిర్వహించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమం కొనసాగుతోంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు మహాశాంతి యాగాన్ని నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యి దోషాన్ని పోగోట్టేందుకు టీటీడీ అధికారులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని చెపట్టారు. హోమం పూర్తి అయిన తరువాత లడ్డూ పోటుతో పాటు ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాని నిర్వహించారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయం యాగశాలలో అర్చకులతోపాటు ఆగం పండితులు వాస్తూ హోం నిర్వహిస్తున్నారు. ఇది పూర్తి అయిన తర్వాత స్వామి నైవేద్యం గంట విరామ సమయంలో ఆలయం మొత్తం పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలవద్ద శుద్ది కార్యక్రమం చేస్తారు.


కాగా సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహిస్తారు. ముందుగా మహ శాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరుగుతుంది. చివరిగా పంచగవ్యాలతో అర్చకులు సంప్రోక్షణ నిర్వహించనున్నారు. కాగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: రికార్డు క్రియేట్ చేసిన హైడ్రా..

రామప్ప ఆలయ పరిసరాలల్లో గుప్తనిధుల కోసం వేట

శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 23 , 2024 | 10:44 AM