డిఎస్సీపై మంత్రి నారాలోకేష్ ఏమన్నారంటే..
ABN, Publish Date - Nov 13 , 2024 | 02:00 PM
అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ డిఎస్సీపై ప్రసంగించారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత 11 డిఎస్సీలు వేశారని, లక్షా 50 వేల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని చెప్పారు. ఇందులో 9 డిఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవే ఉన్నాయన్నారు.
అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ డిఎస్సీపై ప్రసంగించారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత 11 డిఎస్సీలు వేశారని, లక్షా 50 వేల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని చెప్పారు. ఇందులో 9 డిఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవే ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపై చేశామన్నారు. దానిలో భాగంగా టెట్ తరువాత డిఎస్సీ వేయాలని నిర్ణయించామన్నారు.
డీఎస్సీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి 16 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నిరుద్యోగ యువత పోరాటం మూలంగానే 93 శాతం విజయాన్ని అందుకున్నామని, సూపర్ సిక్స్ మ్యానిఫెస్టోలో తొలిహమీ 20 లక్షల ఉద్యోగాలని, దానికి ఉన్న మంత్రి వర్గ ఉపసంఘంకు తనను ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు నియమించారంటూ మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చారు. డిఎస్సీపై గతంలో ఎన్ని కేసులు పడ్డాయి.. వాటిని స్టడీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని.. అధికారులు తగినంత సమయం కావాలని అడిగారని మంత్రి లోకేష్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణం: సబిత ఇంద్రారెడ్డి
రామ్‌గోపాల్ వర్మకు పోలీసుల నోటీసులు..
కీలక సూత్రధారి పట్నం నరేందర్‌రెడ్డి
వారిని సామాజిక కార్యకర్తలనటం సిగ్గుచేటు
గూడ్స్ రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 13 , 2024 | 02:00 PM