విపక్షంపై నిప్పులు చెరిగిన నారా లోకేష్

ABN, Publish Date - Nov 15 , 2024 | 01:39 PM

జగన్‌తో సహా 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారు ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావడంలేదని లోకేష్ నిలదీశారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్బంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మరోవైపు వైసీపీ నేతలు లోకేష్ తల్లిని అవమానించలేదని అంబటి రాంబాబు ట్వీట్ కూడా చేశారు.

అమరావతి: మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో విపక్షంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తమ హయంలో శాసనసభకు రాకుండా పారిపోయారంటూ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. నాడు అసెంబ్లీలో చంద్రబాబు సింగిల్‌గా సింహాల్లా నిలబడ్డారని తెలిపారు. తన తల్లిని అవమానించిన తర్వాతే ఈ కౌరవ సభలో అడుగు పెట్టేది లేదని ప్రకటించి.. బహిష్కరించారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా టీడీపీ సభ్యులు సభకు వచ్చారని తెలిపారు.


ఇక జగన్‌తో సహా 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారు ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావడంలేదని లోకేష్ నిలదీశారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్బంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మరోవైపు వైసీపీ నేతలు లోకేష్ తల్లిని అవమానించలేదని అంబటి రాంబాబు ట్వీట్ కూడా చేశారు. అవమానించినట్లు నిరూపిస్తే క్షమాపణ చెప్పి రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. దీంతో వైసీపీ నేతలు క్షమాపణకు సిద్దం కావాలని టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వెంకటరెడ్డి అక్రమాలు మరిన్ని వెలుగులోకి

నారాయణ కాలేజీలతో పోటీ పడేలా ఇంటర్ కాలేజీలు

మదనపల్లి ఘటన.. వెలుగులోకి కీలక అంశాలు ..

పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు..

ఏపీపీఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న మంత్రి పయ్యావుల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 15 , 2024 | 01:39 PM