ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణం: సబిత ఇంద్రారెడ్డి
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:25 PM
హైదరాబాద్: కొడంగల్‌లో జరిగిన సంఘటన చాలా బాధాకరమని, కలెక్టర్, అధికారులు వెళ్లినప్పుడు వారిపై గ్రామస్తులు దాడులు చేయడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి అన్నారు. ఆ పరిస్థితులు దారితీయడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని తాను భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.
హైదరాబాద్: కొడంగల్‌లో జరిగిన సంఘటన చాలా బాధాకరమని, కలెక్టర్, అధికారులు వెళ్లినప్పుడు వారిపై గ్రామస్తులు దాడులు చేయడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆ పరిస్థితులు దారితీయడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అధికారులపై దాడి బాధాకరమేనని అన్నారు. ఇటు ప్రజలకు జరిగిన ఇబ్బందికి కూడా తాము బాధపడుతున్నామని అన్నారు. కానీ రెండింటిని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిందిపోయి.. ఇక్కడేదో కుట్ర ఉందని ప్రభుత్వం వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని సబిత ఇంద్రారెడ్డి అన్నారు. గ్రామ ప్రజలు భూములు ఇవ్వమని గత నాలుగు నెలల నుంచి చెబుతున్నారని.. అయితే ఆ భూములు తీసుకున్నప్పుడు వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు. అలా కాకుండా అధికారం ఉంది కదా అని ముందుకు పోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయనడానికి ఈ ఘటన ఒక చిన్న ఉదాహరణ అని అన్నారు. బీఆర్ఎస్‌పై నిందలు వేయడం సరికాదని, పార్టీ పరంగా ఈ సంఘటను చూడొద్దని ఆమె కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రామ్‌గోపాల్ వర్మకు పోలీసుల నోటీసులు..
కీలక సూత్రధారి పట్నం నరేందర్‌రెడ్డి
వారిని సామాజిక కార్యకర్తలనటం సిగ్గుచేటు
గూడ్స్ రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు..
విద్యార్ధినిపై వైఎస్సార్సీపీ సర్పంచ్ అత్యాచార యత్నం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 13 , 2024 | 12:25 PM