ఆ పత్రికపై ఎమ్మెల్యే వసంత ఫైర్..

ABN, Publish Date - Sep 07 , 2024 | 01:31 PM

విజయవాడ: బుడమేరుకు సంబంధించి మూడో గండి పూడ్చివేత పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రానికి పూర్తి అయ్యే అవకాశం ఉంది. బుడమేరుకు సంబంధించి హెడ్ రిగ్యులేటర్‌ గేట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఆయన అనుచరులు లిఫ్ట్ చేశారని, అందువల్లే ముంపు ఏర్పడిందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.

విజయవాడ: బుడమేరుకు సంబంధించి మూడో గండి పూడ్చివేత పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రానికి పూర్తి అయ్యే అవకాశం ఉంది. బుడమేరుకు సంబంధించి హెడ్ రిగ్యులేటర్‌ గేట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఆయన అనుచరులు లిఫ్ట్ చేశారని, అందువల్లే ముంపు ఏర్పడిందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. దీనిపై స్పందించిన కృష్ణ ప్రసాద్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఆ ఉగ్ర పత్రిక, ఛానల్, వాళ్ల ఉగ్రనాయకుడికి ఏమీ కనిపించడంలేదని దుయ్యబట్టారు. నాలుగు రోజులుగా గండి పూడ్చివేత పనులు జరుగుతుంటే ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.


తాను 2019 నుంచి శాసనసభుడిగా ఉన్నానని, 2019లో 10 సెం.మీ. వర్షం పడితే.. వెలగలేరు హెడ్ రిగ్యులేటర్‌ వద్దకు వెళ్లానని 11 అడుగుల గేట్ టాప్‌కు నీళ్లు వచ్చాయని, దీంతో గేట్లు ఎత్తి నీరు విడుదల చేశామన్నారు. మొన్న శుక్ర, శని, ఆదివారాలు కురిసిన ఆకస్మిక వర్షానికి వరద క్రమంగా పెరిగిందని.. దీనికి తోడు మైలవరం నియోజకవర్గంలో దాదాపు 25 చెరువులు తెగిపోయాయని.. ఒక్కసారిగా బుడమేరకు వరద చేరి.. హెడ్ రిగ్యులేటర్‌‌కు వరద పోటెత్తిందని కృష్ణ ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించి వీడియోలు కూడా తీశామని ఆయన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్..

బాలాపూర్‌ గణేశ్‌.. వెరీ స్పెషల్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 07 , 2024 | 01:31 PM