ఆ గ్రామంలో మద్యం నిషేధంపై ఉద్యమం..

ABN, Publish Date - Oct 02 , 2024 | 01:56 PM

మహబూబ్‌నగర్ జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలం, కిషన్ నగర్ గ్రామం మాత్రం ఢిపరెంట్.. తెలంగాణలోని దాదాపు అన్నీ గ్రామాల్లోనూ ఉదయం నుంచి రాత్రి వరకు బెల్టు షాపుల ముందు సందడే కనిపిస్తుంది. ఈ క్రమంలో..

మహబూబ్‌నగర్ జిల్లా: బెల్టు షాపులకు తాళం వేసే రోజులు వచ్చాయి. మద్యంపై మహా ఉద్యమానికి రంగం సిద్ధమవుతోంది. శాంపిల్‌గా ఒక ఊరి జనం మద్యం విక్రయాలకు స్వస్తి చెప్పారు. తాగితే జరిమాన.. పట్టిస్తే పారితోషికం అంటూ నినాదించారు. ఇంతకు ఆ గ్రామం ఎక్కడుంది... సమయం సందర్భం ఏదైనా సరే గ్రామాలన్నీ మద్యం మత్తులో ఊగుతూనే కనిపిస్తుంటాయి. కిరాణా కొట్టు కూడా ఓ బెల్టు షాపుగానే అవతారమెత్తుతుంది. ఇలాంటి కాలంలో తమ గ్రామంలో మద్యం తాగేందుకు వీలు లేదని తెగేసి చెప్పే ఊరు ఏదైనా ఉంటుందా.. అంటే అబ్బో అసాధ్యమనక తప్పదు.


కానీ మహబూబ్‌నగర్ జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలం, కిషన్ నగర్ గ్రామం మాత్రం ఢిపరెంట్.. తెలంగాణలోని దాదాపు అన్నీ గ్రామాల్లోనూ ఉదయం నుంచి రాత్రి వరకు బెల్టు షాపుల ముందు సందడే కనిపిస్తుంది. ఈ క్రమంలో కిషన్ నగర్ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు శేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో బెల్టు షాపులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. బెల్టు షాపులు వద్దంటూ నినదించారు. యువత చేపట్టిన ధర్నా గ్రామస్తులందరినీ కదిలించింది. ఈ ఉద్యామానికి పెద్దలంతా సంఘీభావం తెలిపారు. ఇక తమ గ్రామం మద్య నిషేధ గ్రామంగా నిలుస్తుందని ప్రటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కల్యాణ్

రేపటి నుంచి డిజిటల్ కార్డుల కోసం ఇంటింటి సర్వే

హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..

గాంధీజీ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..

హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 02 , 2024 | 01:56 PM