ఇప్పటికీ మహిళలపై చిన్న చూపే: నారా భువనేశ్వరి..

ABN, Publish Date - Oct 11 , 2024 | 09:51 PM

మహిళల శక్తిని తెలియజేసేదే దసరా పండగని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సతీమణి భుననేశ్వరి (Bhuvaneshwari) అన్నారు. పండగ చేసుకోవడమంటే సంస్కృతి, సంప్రదాయాలను పాటించడమే అని ఆమె చెప్పారు.

అమరావతి: మహిళల శక్తిని తెలియజేసేదే దసరా పండగని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సతీమణి భుననేశ్వరి(Bhuvaneshwari) అన్నారు. పండగ చేసుకోవడమంటే సంస్కృతి, సంప్రదాయాలను పాటించడమే అని ఆమె చెప్పారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహించిన నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమానికి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. టెక్నాలజీ యుగంలో ఆడబిడ్డల విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని ఆమె చెప్పారు. మహిళలు అంతరిక్షాలకు వెళ్తున్నారని, రాజకీయాల్లో రాణిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి ఓ గిరిజన మహిళ(ద్రౌపదీ ముర్ము) రాష్ట్రపతిగా ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని నారా భువనేశ్వరి చెప్పారు. మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నప్పటికీ వారిపై ఇంకా చిన్న చూపు పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, సవిత, కుందల దుర్గేశ్ పాల్గొన్నారు.

Updated at - Oct 11 , 2024 | 09:52 PM