ప్రజా రక్షకుడు సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:02 PM
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు పడ్డారో అందరూ చూశారని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వెల్లడించారు. శనివారం సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆమె పర్యటించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు పడ్డారో అందరూ చూశారని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వెల్లడించారు. శనివారం సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భం ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు వస్తున్నారన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత ఆరు నెలల్లో చాలా అభివృద్ధి జరిగిందని.. ఇంకా జరగబోతుందని ఆమె స్పష్టం చేశారు. అదీ కూడా చాలా వేగంగా జరుగుతుందని ఆమె పేర్కొ్న్నారు. తాను నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టినప్పుడు సైతం మహిళలు ఒకటే అడిగేవారని. ఉద్యోగాలు కల్పించాలని అడిగేవారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు ఆ దిశగా చర్యలు చేపడతారని నారా భువనేశ్వరి వివరించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 21 , 2024 | 04:02 PM