అటవీశాఖ అమర వీరులకు పవన్ నివాళి..
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:41 PM
గుంటూరు జిల్లా, పాలెంలోని అటవీ అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమంలో పాల్గొన్న .. పవన్.. ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పేరుపేరునా పలకరించారు.
గుంటూరు జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పాలెంలోని అటవీ అమరవీరుల సంస్మరణ సభ కార్యక్రమంలో పాల్గొన్న .. పవన్.. ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పేరుపేరునా పలకరించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అటవీ శాఖ అధికారులు ఎందరో స్మగ్లర్‌ల చేతిలో ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది తీవ్రమైన దెబ్బలు తిన్నారని.. స్మగ్లర్‌ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 23 మంది కుటుంబ సభ్యులకు సాయం అందించామని అన్నారు. వారిలో అన్ని కేటగిరీల సిబ్బంది, అధికారులు ఉన్నారని, అడవులను సంరక్షణ చేయడంలో వారి పాత్ర కీలకమని కొనియాడారు. వీరప్పన్ వంటి వారితో పోరాటం చేసిన వారూ ఉన్నారని, వన్య సంపద, వన్య ప్రాణులను కాపాడారని.. ఈ స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర అటవీశాఖ తరపున ఆయా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, వారి త్యాగాలను స్మరిస్తూ కొంతమంది ఫారెస్ట్ అధికారుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలకు ఒక ధైర్యం కలిగించేలా సంస్మరణ దినోత్సవం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదు..
యమునా నదిపై దట్టంగా విషపు నురుగు..
విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు..
రక్షణ కోరుతున్న వైసీపీ సైకోలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 10 , 2024 | 12:43 PM