గొడవ పెట్టుకోడానికే వచ్చా..!!

ABN, Publish Date - Oct 03 , 2024 | 09:45 PM

తిరుమలలో వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఉంటామా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతీది రాజకీయం, ఓట్ల కోసమేనా? అంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని పవన్ కల్యాణ్ కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా కీలకమైన సభ అని ఆయన పేర్కొన్నారు.

తనకు ఏ పార్టీపై పగలు, ప్రతీకారాలు లేవని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఎన్నో అవమానాలు చూశా.. భరించానన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు దాటిందని గుర్తు చేశారు. ఈ వంద రోజుల్లో తాను బయటకు రాలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించామని తెలిపారు. గురువారం సాయంత్రం తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి డిక్లరేషన్ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు.


తిరుమలలో వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఉంటామా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతీది రాజకీయం, ఓట్ల కోసమేనా? అంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని పవన్ కల్యాణ్ కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా కీలకమైన సభ అని ఆయన పేర్కొన్నారు. మీతో జేజేలు కొట్టించుకోవడానికి తాను తిరుపతి రాలేదన్నారు. మీతో గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికి తాను తిరుపతికి వచ్చానని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Updated at - Oct 03 , 2024 | 09:45 PM