చెవులోపువ్వులుపెట్టుకున్నామా..: బొత్స

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:46 PM

విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం తమ బాధ్యతని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సభలో సమాధానం చెప్పేటప్పుడు సభ్యులకు వినే ఓపిక లేకపోతే ఎలా అధ్యక్షా అంటూ మంత్రి ప్రశ్నించారు. చట్ట సభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చుపెడుతుంటే దాన్ని లేవనెత్తితో ఆరోజు ప్రతిపక్షంలో తమను పట్టించుకోలేదని పయ్యావుల విమర్శించారు.

అమరావతి: శాసనమండలి సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం (వైఎస్సార్‌సీపీ) చేసిన అప్పులపై అధికార.. విపక్షాల మధ్య చర్చ వాడీ వేడిగా సాగింది. ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యాలపై వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినదంతా వినడానికి తాము చెవులో పువ్వులు పెట్టుకుని ఉన్నామా.. అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టి బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందన్నారు. దానికి నిరసన తెలుపు సభ నుంచి వాక్ అవుట్ చేయడం తమ హక్కు అని అన్నారు.


గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని.. అని టీడీపీ సభ్యులు ప్రశ్నించగా.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 9,74,000 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని గవర్నర్, కేంద్ర మంత్రికి అప్పుడే ఫిర్యాదు చేశామని చెప్పారు. శాసన సభ, మండలి పర్యవేక్షణలో రాకుండా నిధులు సేకరించారని, చట్ట సభలకు తెలియకుండానే ఖర్చు చేశారని మంత్రి కేశవ్ విమర్శించారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి..

అదానీకి చెందిన హైడ్రో వద్ద ఆందోళన

‘నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి’

గంటన్నరపాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకున్న గుండె..

రష్యా-ఉక్రెయిన్ వార్‌లో కీలక పరిణామం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 20 , 2024 | 12:46 PM