ఉగ్రవాదంపై పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు..

ABN, Publish Date - Oct 24 , 2024 | 10:03 AM

బ్రిక్స్‌ దేశాల్లో యువతను ఉగ్రవాదంవైపు పురికొల్పడాన్ని అడ్డుకోవడానికి క్రియాశీల చర్య లు చేపట్టాలని, ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడంలో అందరూ కలిసి పనిచేయాలని, ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తేల్చిచెప్పారు.

కజాన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాలో జరిగిన 16వ బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం అనే సవాలును ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరికి తావు లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అందరూ ఏకతాటిపై నిలిచి, పరస్పరం పటిష్ఠ మద్దతుతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. భారత్‌ ఎప్పుడూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికే మద్దతు తెలుపుతుందని.. యుద్ధానికి కాదని చెప్పారు. శాంతి చర్చల ద్వారానే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి పరిష్కారం లభిస్తుందని పునరుద్ఘాటించారు. కొవిడ్‌ లాంటి సవాళ్లను సమష్టిగా ఎదుర్కొన్న తరహాలోనే మనమంతా కలిసి భావి తరాలకు భద్రతమైన, పటిష్ఠమైన భవిష్యత్తును అందించేందుకు సరికొత్త అవకాశాలను సృష్టించాలని మోదీ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రెండో రోజు విచారణకు IAS అధికారి అమోయ్

ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

నేడు విజయనగరం జిల్లా పర్యటనకు జగన్

చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 24 , 2024 | 10:03 AM