మన్మోహన్ అంత్యక్రియలకు మోదీ..

ABN, Publish Date - Dec 28 , 2024 | 12:55 PM

భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మహ్మోహన్ సింగ్(Mahmohan Singh) అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. అధికారిక లాంఛనాలతో నిగమ్ బోధ్ ఘాట్‌(Nigam Bodh Ghat)లో ఆయన అంత్యక్రియలు మెుదలయ్యాయి.

ఢిల్లీ: భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మహ్మోహన్ సింగ్ (Mahmohan Singh) అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. అధికారిక లాంఛనాలతో నిగమ్ బోధ్ ఘాట్‌ (Nigam Bodh Ghat)లో ఆయన అంత్యక్రియలు మెుదలయ్యాయి. మాజీ ప్రధాని పార్థివదేహాన్ని చూసేందుకు ప్రముఖులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. మహ్మోహన్ సింగ్‌ను కడసారి చూసేందుకు నిగమ్ బోధ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేరుకున్నారు. రాష్ట్రపతి దౌపదీముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రముఖులు పెద్దఎత్తున తరలివచ్చి ఘన నివాళులు అర్పించారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలు స్పరించుకున్నారు.

Updated at - Dec 28 , 2024 | 12:56 PM