రామ్‌గోపాల్ వర్మకు పోలీసుల నోటీసులు..

ABN, Publish Date - Nov 13 , 2024 | 11:56 AM

గతంలో రామ్‌గోపాల్ వర్మ ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వ్యూహం సినిమా తెరకెక్కించారు. ఆ చిత్రం ప్రమోష‌న్‌లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అసభ్యకరంగా, కించ‌ప‌రిచేలా పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా ‌మద్దిపాడు పీఎస్‌లో ఆయనపై కేసు న‌మోదైంది.

అమరావతి: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వర్మపై ప్రకాశం జిల్లా, మద్దిపాడులో పోలీస్ కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాలని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని వర్మకు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ ఇంటికి మద్దిపాడు పోలీసులు చేరుకుని నోటీసులు ఇచ్చారు. గతంలో ఆయన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వ్యూహం సినిమా తెరకెక్కించారు. ఆ చిత్రం ప్రమోష‌న్‌లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అసభ్యకరంగా, కించ‌ప‌రిచేలా పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా ‌మద్దిపాడు పీఎస్‌లో కేసు న‌మోదైంది.


ఈ కేసులో భాగంగా విచార‌ణ‌కు హాజరు కావాల‌ని వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఆర్జీవీ ఎక్స్‌లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మూడు రోజులు క్రితం కేసు నమోదు చేసిన ఒంగోలు పోలీసులు మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌కు వచ్చి ఈ మేరకు నోటీసులు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కీలక సూత్రధారి పట్నం నరేందర్‌రెడ్డి

వారిని సామాజిక కార్యకర్తలనటం సిగ్గుచేటు

గూడ్స్ రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు..

విద్యార్ధినిపై వైఎస్సార్సీపీ సర్పంచ్ అత్యాచార యత్నం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 13 , 2024 | 11:56 AM