అదానీకి చెందిన హైడ్రో వద్ద ఆందోళన

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:06 PM

స్థానిక ఎమ్మెల్యేకు సమాచారమివ్వకుండా ఇక్కడ పనులెలా చేపడతారంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి అదానీ పవర్ హైడ్రో వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని ఆందోళన కారులను అడ్డుకున్నారు.

కడప జిల్లా: రాయకుండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదానీ చేపడుతున్న పవర్ హైడ్రో ప్రొజెక్టు వద్ద ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఆందోళన చేపట్టారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని ఆందోళన కారులను అడ్డుకున్నారు.


రాయకుండ వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్‌ నిర్మాణాన్ని అదానీ సంస్థ ప్రారంభించింది. క్యాంపు ఏర్పాటు చేసుకుని యంత్రాలతో నేల చదును పనులు చేపట్టింది. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తమ అనుచరులతో వచ్చి అదానీ సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత సంస్థ ప్రతినిధులతో చర్చించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘నన్ను చంపేసేలా ఉన్నారు.. కాపాడండి’

గంటన్నరపాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకున్న గుండె..

రష్యా-ఉక్రెయిన్ వార్‌లో కీలక పరిణామం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 20 , 2024 | 12:07 PM