స్థల వివాదంపై పీవీ సింధు ఏమన్నారంటే..
ABN, Publish Date - Nov 07 , 2024 | 11:49 AM
విశాఖ: నగరంలోని తోటగరువులో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు భూమి పూజ చేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అకాడమీ నిర్మాణానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె శంఖుస్థాపన చేశారు. ఏడాది లోపు అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తమ స్థలంపై ఎలాంటి వివాదం లేదని సింధు స్పష్టం చేశారు.
విశాఖ: నగరంలోని తోటగరువులో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు భూమి పూజ చేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అకాడమీ నిర్మాణానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె శంఖుస్థాపన చేశారు. ఏడాది లోపు అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తమ స్థలంపై ఎలాంటి వివాదం లేదని సింధు స్పష్టం చేశారు. స్థానికులు అడుగుతున్నట్లు కళాశాలకు వేరే చోట స్థలం కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపామని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా సీవీ సింధు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ప్రభుత్వం తనకు అకాడమీ కోసం ఇచ్చిన స్థలంలో ఈరోజు భూమి పూజ చేశామని, చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ అకాడమీతో భవిష్యత్‌లో ఎంతో మంది క్రీడాకారులు తయారవుతారని తెలిపారు. చాలా అకాడమీలు ఉన్నప్పటికీ విశాఖలో పెద్ద అకాడమీ ఉండాలనేది తన ఆలోచన అని, పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరైనా అకాడమీకి వచ్చి కష్టపడి పైకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే అకాడమీ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. భూమి విషయంలో ఎలాంటి వివాదం లేదని పీవీ సింధు మరోసారి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం (ఫోటో గ్యాలరీ)
20 రోజులుగా రైతన్నల బాధలు: కేటీఆర్
ఫార్ములా-ఈ రేసింగ్‌పై ఏసీబీ దూకుడు..
బోరుగడ్డ అనిల్‌కు పోలీసుల రాచమర్యాదలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 07 , 2024 | 11:49 AM