ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్
ABN, Publish Date - Oct 04 , 2024 | 12:50 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ మేరకు రజినీకాంత్ సతీమణి లత రజినీకాంత్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
చెన్నై: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్త నాళంపై వాపు రావడంతో వైద్యులు ఆయనకు ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. చికిత్స అనంతరం వైద్యులు రజినీకాంత్‌ను మూడు రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే మరోవారం రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ మేరకు రజినీకాంత్ సతీమణి లత రజినీకాంత్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఆయనకు ఎలాంటి అపాయం లేదని చెప్పడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా రజినీకాంగ్ ఆసుపత్రిలో చేరినట్లు తెలియగానే అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇప్పుడు ఆయన ఇంటికి చేరుకోవడంతో వారంతా ఆనందంగా ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కీలక నిర్ణయం
వివేకా కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం
బాల్కంపేట ఎల్లమ్మ తల్లి మహా లక్ష్మి అలంకరణలో..
ఖమ్మం టీఆర్ఎస్ ఆఫీస్‌లో బతుకమ్మ సంబరాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 04 , 2024 | 12:50 PM