వైఎస్సార్‌సీపీ అక్రమాలపై నివేదిక రెడీ..
ABN, Publish Date - Dec 06 , 2024 | 11:13 AM
అమరావతి: ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన కబ్జాలు, దందాలు, వసూళ్ల నిగ్గు తేల్చి.. బాధితులకు న్యాయం చేసి.. దోషులను దండించేలా కూటమి ప్రభుత్వం పకడ్బంధిగా అడుగులు వేస్తోంది. తాడేపల్లిలో మకం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లి నేతల వరకు జరిగిన అరాచకాలపై ఓ నివేదిక సిద్ధమైంది.
అమరావతి: ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన కబ్జాలు, దందాలు, వసూళ్ల నిగ్గు తేల్చి.. బాధితులకు న్యాయం చేసి.. దోషులను దండించేలా కూటమి ప్రభుత్వం పకడ్బంధిగా అడుగులు వేస్తోంది. తాడేపల్లిలో మకం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లి నేతల వరకు జరిగిన అరాచకాలపై ఓ నివేదిక సిద్ధమైంది. వైసీపీ ఐదేళ్ల అక్రమాలు, ఆక్రమణల గుట్టు రట్టు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో రెండు నెలల కిందటే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్టుమెంట్ రంగంలోకి దిగింది.
వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టం నుంచి సామాన్య ప్రజలకు జరిగిన కష్టాలవరకు అనేక కోణాల్లో విజిలెన్స్ సమగ్ర నివేదిక ఇచ్చింది. వాటిని అంశాల వారీగా వర్గీకరించి దేనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్‌ను నియమంచనున్నట్లు సమాచారం. దీనిపై రేపో మాపో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన..
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు..
ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు..
విశాఖలో డీప్ టెక్నాలజీ సదస్సు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 06 , 2024 | 11:14 AM