ఆందోళనలో రేవంత్ రెడ్డి సర్కార్..

ABN, Publish Date - Oct 24 , 2024 | 10:46 AM

ఓవైపు ప్రభుత్వ ప్రాధాన్యాలు పెరిగిపోతుండగా అందుకు తగ్గట్లుగా రాబడి రాకపోవడం రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఇబ్బందికరంగా మారుతోంది. మూడో దశ రుణమాఫీ, కరీఫ్ సీజన్ రైతు భరోసా, సమగ్ర గురుకుల విద్యా భవనాల నిర్మాణం వంటి వాటికి నిధులు అవసరమైన వేళ రాబడి తగ్గుతుండడం ఆందోళనకరం.

హైదరాబాద్: ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయినా.. తెలంగాణ ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. సర్కార్ అంచనాలకు.. వస్తున్న రాబడులకు పొంతన ఉండడంలేదు. బడ్జెట్‌లో అంచనా వేసిన దానికంటే చాలా తక్కువ రాబడి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ప్రభుత్వ ప్రాధాన్యాలు పెరిగిపోతుండగా అందుకు తగ్గట్లుగా రాబడి రాకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. మూడో దశ రుణమాఫీ, కరీఫ్ సీజన్ రైతు భరోసా, సమగ్ర గురుకుల విద్యా భవనాల నిర్మాణం వంటి వాటికి నిధులు అవసరమైన వేళ రాబడి తగ్గుతుండడం ఆందోళనకరం.


ఆదాయం కోసం భూములను విక్రయించడం.. తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం.. భూముల మార్కెట్ విలువలు.. మద్యం ధరల పెంపువంటి మార్గాలు తప్ప ఇతర మార్గాలేవీ కనిపించడంలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంచనా వేసిన బడ్జెట్ రాబడులు కూడా తగ్గుతుండడం ప్రభుత్బాన్ని కలవరపెడుతోంది. సెప్టెంబర్ నెల రాష్ట్ర ఆదాయ వ్యయాలకు సంబంధించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిన్న (బుధవారం) నివేదిక విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉగ్రవాదంపై పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు..

రెండో రోజు విచారణకు IAS అధికారి అమోయ్

ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

నేడు విజయనగరం జిల్లా పర్యటనకు జగన్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 24 , 2024 | 10:46 AM