తమిళ రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ..?

ABN, Publish Date - Aug 23 , 2024 | 08:49 AM

నగిరి నుంచి రెండు సార్లు గెలిచి జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రోజా.. 2024లో ఘోర పరాజయం తర్వాత పొలిటికల్ అజ్ఞాతవాసిగా మారారు. ఓటమి తర్వాత చెన్నైకు మకాం మార్చిన రోజా.. తమిళనాడు పాలిటిక్స్‌లో ఫిక్స్ అయిపోయే ప్లాన్‌లో ఉన్నారనే టాక్..

చిత్తూరు జిల్లా: వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్స్‌లో ఒకరైన రోజా సైలెంట్ మూడ్‌లోకి వెళ్లారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త సౌండ్ పెంచే ప్రయత్నం చేసినా.. ఉన్నట్టుండి మ్యూట్ మోడ్‌లోకి మారడానికి కారణాలేంటి? ఏపీ రాజకీయాలను వదిలేసి తమిళనాడు పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టే ప్లాన్‌లో ఉన్నారా? తమిళ హీరో విజయ్ ఏర్పాటు చేసిన ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.


నగిరి నుంచి రెండు సార్లు గెలిచి జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రోజా.. 2024లో ఘోర పరాజయం తర్వాత పొలిటికల్ అజ్ఞాతవాసిగా మారారు. తన నోరే ప్లస్ అనుకునే రోజాకు కొన్నిసార్లు అదే మైనస్‌గా మారింది. అధికారంలోఉన్న ఐదేళ్లు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడంతోపాటు ప్రతిపక్షనేతలను వ్యక్తిగతంగా దూషించడం వంటి చర్యలతో రోజా తన స్థాయిని తానే దిగజార్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఓటమి తర్వాత చెన్నైకు మకాం మార్చిన రోజా.. తమిళనాడు పాలిటిక్స్‌లో ఫిక్స్ అయిపోయే ప్లాన్‌లో ఉన్నారనే టాక్.. తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కళగం.. టీఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు. పార్టీ గీతాన్ని విడుదల చేశారు. ఇప్పుడు రోజా టీఎంకే పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయం వర్గాల్లో వినిపిస్తున్న మాట..


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎంల జాబితాలో టాప్-5లో చంద్రబాబు..

ప్రధాని మోదీపై రాహుల్ కామెంట్స్..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

జోగి రమేష్‌ను ప్రశ్నిస్తుంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 23 , 2024 | 08:49 AM