రష్యా-ఉక్రెయిన్ వార్‌లో కీలక పరిణామం
ABN, Publish Date - Nov 20 , 2024 | 07:45 AM
అగ్ర రాజ్యం తయారు చేసిన ఆర్మీ టాక్టికల్ మిసాయిల్ సిస్టం క్షిపణులను ఉక్రెయిన్ తొలిసారి తమ దేశంపై ప్రయోగించిందని రష్యా తెలిపింది. తామందిస్తున్న క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిస్తున్నట్లు బైడన్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోజు చేసుకోడం గమనార్హం..
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన క్షిపణులు రష్యాపై దూసుకువెళ్లాయి. ఈ విషయాన్ని రష్యా మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. తమ దేశంపైకి దూసుకువచ్చిన క్షిపణుల్లో ఐదింటిని కూల్చివేశామని.. మరోదాన్ని నాశనం చేసినట్లు రష్యా తెలిపింది. క్షిపణి శకలాలు నేల కూడంతో కొన్ని ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగాయని.. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా అగ్ర రాజ్యం తయారు చేసిన ఆర్మీ టాక్టికల్ మిసాయిల్ సిస్టం క్షిపణులను ఉక్రెయిన్ తొలిసారి తమ దేశంపై ప్రయోగించిందని రష్యా తెలిపింది. తామందిస్తున్న క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిస్తున్నట్లు బైడన్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోజు చేసుకోడం గమనార్హం..
ఈ వార్తలు కూడా చదవండి..
వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 20 , 2024 | 07:45 AM