ఇది మనవత్వానికే మాయని మచ్చ..
ABN, Publish Date - Dec 16 , 2024 | 01:01 PM
ప్రకాశం జిల్లా: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి వృద్దాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకులు మొహం చాటేశారు. నడిరోడ్డుపై కన్నతల్లిని వదిలేశారు. అంతేకాకుండా వృద్ధురాలికి వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా తీసుకుని విడిచిపెట్టారు.
ప్రకాశం జిల్లా: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి వృద్దాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకులు మొహం చాటేశారు. నడిరోడ్డుపై కన్నతల్లిని వదిలేశారు. అంతేకాకుండా వృద్ధురాలికి వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా తీసుకుని విడిచిపెట్టారు. మానవత్వానికే మాయని మచ్చ తెచ్చిన ఈ సంఘటన ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, వెన్నంపల్లి గ్రామంలో జరిగింది.
వెన్నంపల్లి గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మ అనే వృద్ధురాలి భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. తర్వాత తన ముగ్గురు కుమారుల వద్ద ఆమె ఉండేది. అయితే కన్న తల్లిని పోషించడం భారంగా భావించిన కొడుకులు ఆమెను తీవ్రంగా వేధించేవారు. ఆస్తులు కూడా పంచుకున్నారు. అదే విధంగా వృద్ధురాలికి వస్తున్న పెన్షన్ సమయం రాగానే ప్రతినెల ఆమెను బలవంతంగా తీసుకువెళ్లేవారు. ఆ డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత తల్లిని వదిలిపెట్టి వెళ్లిపోయేవారు. ఆమె నివసిస్తున్న ఇల్లు గతంలోనే కూలిపోయింది. దీంతో స్థిర నివాసం లేక ఆమె నడి రోడ్డుపై ఉంటోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
r. NTR: ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు..
KC రెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం..
జగన్ నిర్వాకం.. రైతుల కష్టాలు..
ABN Live..: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 16 , 2024 | 01:01 PM