పెన్షనర్ల వద్ద చేతివాటం.. సచివాలయ ఉద్యోగిపై వేటు
ABN, Publish Date - Dec 31 , 2024 | 10:00 PM
కడప జిల్లా జమ్మలమడుగులో చేతి వాటం ప్రదర్శించిన సచివాలయ ఉద్యోగినిని సస్పెండ్ చేశారు. వృద్ధులకు పెన్షన్ ఇవ్వడానికి రూ. 300 వసూల్ చేశారు. పెన్షన్ ఇవ్వడానికి భారతీ అనే మహిళ నగదు డిమాండ్ చేసింది.
కడప జిల్లా జమ్మలమడుగులో చేతి వాటం ప్రదర్శించిన సచివాలయ ఉద్యోగినిని సస్పెండ్ చేశారు. వృద్ధులకు పెన్షన్ ఇవ్వడానికి రూ. 300 వసూల్ చేశారు. పెన్షన్ ఇవ్వడానికి భారతీ అనే మహిళ నగదు డిమాండ్ చేసింది. ఇదేమిటని లబ్దిదారులు ప్రశ్నించారు. ప్రింటర్లు, స్కానర్లు కొనుగోలు కోసం అంటూ ఆమె జవాబు ఇచ్చింది. దీనిపై లబ్ది దారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆ క్రమంలో మహిళా ఉద్యోగినిని విధుల నుంచి తప్పిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 31 , 2024 | 10:00 PM