ఆ పదాలు మార్చలేము: సుప్రీం కోర్టు

ABN, Publish Date - Oct 22 , 2024 | 10:35 AM

న్యూఢిల్లీ: రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు సెక్కులర్ అనే పదాలను తొలగించాలన్న వాదనలపై సుప్రీం కోర్టు సూటిగా స్పందించింది. భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలోని ఈ పదాలు ఇమిడి ఉన్నాయని తెలిపింది. ఈ విషయాన్ని న్యాయస్థానాలు పలుమార్లు తమ తీర్పును స్పష్టం చేశాయని గుర్తు చేసింది.

న్యూఢిల్లీ: రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు సెక్కులర్ అనే పదాలను తొలగించాలన్న వాదనలపై సుప్రీం కోర్టు సూటిగా స్పందించింది. భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలోని ఈ పదాలు ఇమిడి ఉన్నాయని తెలిపింది. ఈ విషయాన్ని న్యాయస్థానాలు పలుమార్లు తమ తీర్పును స్పష్టం చేశాయని గుర్తు చేసింది. ఇక రాజ్యాంగ పీఠిక నుంచి ఈ పదాలను తొలగించాలని కోరుతూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాలపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది విష్ణుశంకర్‌జైన్‌ వాదనలు వినిపిస్తూ.. సోషలిస్ట్‌, సెక్యులర్‌ పదాలను చేర్చేందుకు 1976లో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణపై పార్లమెంటులో చర్చే జరగలేదన్నారు.


దీంతో.. ఈ పదాలకు అనేక వివరణలు ఉన్నాయని, కానీ.. వాటిని భిన్నంగా అన్వయించుకుంటున్నారని దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. మరో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ వాదనలు వినిపిస్తూ 42వ సవరణ అమల్లోకి వచ్చేనాటికి నాటి ప్రధాని ఇందిర దేశంలో ఎమర్జెన్సీ విధించారని తెలిపారు. దీనిపై సంజీవ్‌ఖన్నా స్పందిస్తూ, ‘‘మీరు.. భారత్‌ సెక్యులర్‌ దేశంగా ఉండాలనుకోవడంలేదా?’’అని ప్రశ్నించారు. అయితే తాము అలా అనడంలేదని, ఆ సవరణను మాత్రమే సవాలు చేస్తున్నామని న్యాయవాది జైన్‌ చెప్పారు.

పీఠికలో ఈ రెండు పదాలను చేర్చడం ద్వారా కొత్త నిర్ణయాలకు అవకాశం కల్పించినట్లయిందని అన్నారు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వాదనలు వినిపిస్తూ.. పీఠికలో 1949 నవంబరు 26 తేదీ ఉండడం తప్పు అని నిరూపిస్తానన్నారు. పీఠిక రెండు భాగాలుగా ఉండొచ్చని, ఒకటి తేదీతో, మరొకటి తేదీ లేకుండా ఉండొచ్చని అన్నారు. సోషలిస్ట్‌, సెక్యులర్‌ పదాలను పీఠికలో చేర్చేందుకు దేశ ప్రజలు అంగీకరించారని చెప్పడం సరికాదన్నారు. దీంతో ఇందుకు సంబంధించిన పత్రాలను పిటిషనర్లు సమర్పిస్తే పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. నోటీసులు జారీ చేసేందుకు మాత్రం నిరాకరించింది. విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: చందానగర్‌లో విషాద ఘటన..

గిరిజన ప్రాంతాల అభివృద్ది, పథకాలపై సమీక్షించిన సీఎం

నేడు కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 22 , 2024 | 10:35 AM