తిరుమల లడ్డూ వివాదం.. దూకుడు పెంచిన సిట్..

ABN, Publish Date - Sep 29 , 2024 | 09:49 PM

తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వ్యవహారంలో సిట్(SIT) దూకుడు పెంచింది. విచారణలో భాగంగా టీటీడీ ఈవో శ్యామలరావుతో ఆయన నివాసంలో సిట్ బృందం భేటీ అయ్యింది.

తిరుపతి: తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వ్యవహారంలో సిట్(SIT) దూకుడు పెంచింది. విచారణలో భాగంగా టీటీడీ ఈవో శ్యామలరావుతో ఆయన నివాసంలో సిట్ బృందం భేటీ అయ్యింది. సుమారు గంటపాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. నెయ్యి సరఫరాలో ప్రమేయం ఉన్న వారందరినీ విచారించాలని సమావేశంలో నిర్ణయించారు. సిట్ బృందం తన దర్యాప్తును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో టీటీడీ మార్కెటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో మెుదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులో ఉన్న అనేక అంశాలపై కూలంకశంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిట్ అభిప్రాయపడింది. దీంతో ఫిర్యాదు చేసిన మురళీకృష్ణను తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్‌కు పిలుపించుకుని విచారించారు. మురళీకృష్ణ నుంచి కీలక సమాచారాన్ని సిట్ టీమ్ రాబట్టింది. మురళీకృష్ణ ఫిర్యాదులో ఏఆర్ డెయిరీ, టీటీడీకి మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించారు. దాంతోపాటు నెయ్యిలో కల్తీ జరిగిన పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరిచారు. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ నుంచి సిట్ బృందం అనేక అంశాలను రాబట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సిట్ ఏర్పాటుపై టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్..

హై స్పీడ్ కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం..

జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

72 అడుగుల డూండీ గణేష్ నిమర్జనం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 29 , 2024 | 09:51 PM