ఇంకా వైసీపీ మత్తులోనే కొందరు అధికారులు..
ABN, Publish Date - Aug 08 , 2024 | 09:44 AM
కర్నూలు జిల్లా: మంత్రాలయం నియోజకవర్గంలో కొందరు అధికారుల తీరు ఇంకా మారలేదు. రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ పవర్ కోల్పోయి కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. కానీ మంత్రాలయం అధికారుల్లో మాత్రం ఏ రకమైనా మార్పు లేదు. ఇంకా వైసీపీతోనే అంటకాగుతున్నారు.
కర్నూలు జిల్లా: మంత్రాలయం (Mantralayam) నియోజకవర్గంలో కొందరు అధికారుల (Some Officers) తీరు ఇంకా మారలేదు. రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ (YCP) పవర్ కోల్పోయి కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) కొలువుతీరింది. కానీ మంత్రాలయం అధికారుల్లో మాత్రం ఏ రకమైనా మార్పు లేదు. ఇంకా వైసీపీతోనే అంటకాగుతున్నారు. ముఖ్యంగా పోలీస్ (Police), మైనింగ్ (Mining) శాఖల అధికారులైతే ఫ్యాన్ పార్టీ నేతల మత్తులోనే జోగుతున్నారని సమాచారం.
మంత్రాలయం నియోజక వర్గంలోని గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇటీవల నందవరం మండలం, జీఆర్పీ చిలకలదోని ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌లో బీభత్సం సృష్టించి.. ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, స్టాటర్లను పగులగొట్టారు. సుమారు రూ. 25 లక్షల మేర ఆస్తి నస్టం జరిగింది. గత నెల 28న మంత్రాలయం మండలం, మాధవరం ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ యంత్ర పరికరాలను ద్వంసం చేశారు. దాదాపు రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందన్న అంచనాలు ఉన్నాయి. ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..
ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 08 , 2024 | 09:45 AM