విశాఖకు అదానీ డేటా సెంటర్ వస్తుందా..

ABN, Publish Date - Nov 24 , 2024 | 09:38 PM

విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు గత టీడీపీ ప్రభుత్వంలోనే అవకాశం వచ్చింది. అయితే ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే పూర్తిస్థాయిలో భూమిని బదలాయిస్తామంటూ అదానీకి టీడీపీ ప్రభుత్వం చాలా వరకు షరతులు పెట్టింది.

విశాఖ: నగరంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు గత టీడీపీ ప్రభుత్వంలోనే అవకాశం వచ్చింది. అయితే ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే పూర్తిస్థాయిలో భూమిని బదలాయిస్తామంటూ అదానీకి టీడీపీ ప్రభుత్వం చాలా వరకు షరతులు పెట్టింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన భూమిని తగ్గించి తమకు దీర్ఘకాలిక పెట్టుబడులు వద్దని ఐదేళ్లలో ఏమి చేస్తారో దానికే ఒప్పందం చేసుకుంటామని కొత్త ఎంవోయూ అదానీతో కుదుర్చుకుంది. దీని ప్రకారం మధురవాడలో అదానీకి 130 ఎకరాల స్థలం కేటాయించింది. అందులో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్శిటీ, రీక్రియేషన్ పార్కు ఏర్పాటు చేయాల్సి ఉంది. మూడేళ్లలో రూ.14,634 కోట్ల పెట్టుబడితో 24,990 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 2020 నవంబర్‌లోనే ఒప్పందం జరిగింది. మరో 60 ఎకరాల భూమిని సైతం అప్పట్లో జగన్ ప్రభుత్వం అదానీకి కేటాయించింది.

Updated at - Nov 24 , 2024 | 09:58 PM