అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానాస్పద మృతి

ABN, Publish Date - Aug 25 , 2024 | 01:13 PM

వాషింగ్టన్: నెల్లూరు జిల్లా, మేనకూరుకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ పేరంశెట్టి రమేశ్ బాబు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అమెరికాలోని తన ఇంటి కారు పార్కింగ్ షెడ్ వద్ద గన్ ఫైరింగ్ జరగడం వల్ల మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక గుర్తు తెలియని దుండగులు హత్య చేశారా?..

వాషింగ్టన్: నెల్లూరు జిల్లా, మేనకూరుకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ పేరంశెట్టి రమేశ్ బాబు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అమెరికాలోని తన ఇంటి కారు పార్కింగ్ షెడ్ వద్ద గన్ ఫైరింగ్ జరగడం వల్ల మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక గుర్తు తెలియని దుండగులు హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. రమేష్ బాబు మేనకూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్య నభ్యసించిన తర్వాత తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు. అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలో పలు ఆస్పత్రులు నిర్మించి సేవలందించి మంచి వైద్యుడిగా గుర్తింపు పొందారు. రమేష్ బాబు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్వగ్రామం మేనకూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


నెల్లూరు జిల్లా, మేనకూరులో రమేష్ బాబు సాధారణ రైతుకుంబంలో జన్మించారు. ఆయన వయస్సు 64 ఏళ్లు. అమెరికాలో చాలా ఏళ్ల క్రితం స్థిరపడి.. అమెరికన్స్‌తో పాటు విదేశీయులందరికీ వైద్య సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన బయటకు వెళ్లేందుకు పార్కింగ్‌లో ఉన్న తన కారు తీస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు తుపీకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రమేష్ బాబు అక్కడికక్కడే చనిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మెడికల్ కాలేజ్ కూల్చే కుట్ర: పల్లా రాజేశ్వర్ రెడ్డి

తిరుమలయ్య గుట్టకు పోటెత్తిన భక్తులు..

నేడు ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు

టీటీడీలో స్కామ్.. ఆ ముగ్గురిపై ఫిర్యాదులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 25 , 2024 | 01:13 PM