‘అందుకే గురుదక్షిణ అని అన్నాం’
ABN, Publish Date - Nov 19 , 2024 | 12:55 PM
టీడీపీ హయాంలో ఇషా ఫౌండేషన్‌కు నిబంధల ప్రకారం భూమి ఇచ్చామని.. అయితే ఆ ఫౌండేషన్ భూమిని వినియోగించుకోలేకపోయిందని.. దీంతో ఆ భూమిని గత నెలలో తిరిగి వెనక్కి తీసుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. అనాడు శారద పీఠానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి భూములు ఇచ్చిందని మంత్రి ఆరోపించారు.
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో విశాఖ శారదా పీఠానికి భూమి కేటాయింపులపై ఏపీ శాసనమండలిలో వాడి వేడిగా చర్చ జరిగింది. దీనిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న ప్రభుత్వం అధ్యాత్మిక కేంద్రాలకు భూములు ఇవ్వవచ్చునని.. అందుకు నిబంధనలు ఉంటాయన్నారు. వాటిని అతిక్రమించి శారద పీఠానికి భూములు కేటాయించారు కాబట్టే గురుదక్షిణ అన్నామని మంత్రి వివరించారు.
టీడీపీ హయాంలో ఇషా ఫౌండేషన్‌కు నిబంధల ప్రకారం భూమి ఇచ్చామని.. అయితే ఆ ఫౌండేషన్ భూమిని వినియోగించుకోలేకపోయిందని.. దీంతో ఆ భూమిని గత నెలలో తిరిగి వెనక్కి తీసుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. అనాడు శారద పీఠానికి కేటాయించిన భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘించి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని ఆరోపించారు. చేసిన తప్పును సమర్ధించుకోవడం వైఎస్సార్‌సీపీకి అలవాటేనని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాక్ నౌకను ఛేజ్ చేసిన ఐసీజీ నౌక..
కొన్ని లక్షల మందికి మేలు జరిగింది: ఎమ్మెల్యే కోటం రెడ్డి
విచారణకు రాలేను.. వారం రోజుల గడువు కావాలి: రాంగోపాల్ వర్మ
నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-20 ఉపగ్రహం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 19 , 2024 | 12:55 PM