బాబు, పవన్ ఫ్లెక్సీల చించివేత..
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:39 PM
ఎన్టీఆర్ జిల్లా: చందర్లపాడు మండలంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. తుర్లపాడులో వరదల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాపాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: చందర్లపాడు మండలంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. తుర్లపాడులో వరదల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాపాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని దుండగులు చించివేశారు. దీనిపై కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫ్లెక్సీలను చించివేసింది. వైసీపీ కార్యకర్తలేనంటూ స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తన పాలనా అనుభవంతో వరదల విపత్తునుంచి గట్టెక్కించారు. దాదాపు 10 రోజుల పాటు కలెక్టర్ కార్యాలయంలో ఉండి వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు చేశారు. వరదముప్పు నుంచి తమను గట్టెక్కించగలిగారని బాధితులు కొనియాడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు చాలా చోట్ల చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల చిత్రపటాలకు పాలభిషేకం చేశారు.
Updated at - Sep 16 , 2024 | 12:39 PM