హైరిస్క్ జోన్‌లో తెలుగు రాష్ట్రాలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 04:34 PM

వాతావరణంలో మార్పుల ప్రభావం వల్లనే రెండు తెలుగు రాష్ట్రాలు వరదలు, కరువు వంటి విపత్తులు ఎదుర్కొంటున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో దేశంలో అనేక రాష్ట్రాలు ఇదే తరహా ప్రమాదంలో ఉన్నాయని భారత వాతావరణ శాఖ విశ్రాంత డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ కేజే రమేష్‌ వెల్లడించారు.

వాతావరణంలో మార్పుల ప్రభావం వల్లనే రెండు తెలుగు రాష్ట్రాలు వరదలు, కరువు వంటి విపత్తులు ఎదుర్కొంటున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో దేశంలో అనేక రాష్ట్రాలు ఇదే తరహా ప్రమాదంలో ఉన్నాయని భారత వాతావరణ శాఖ విశ్రాంత డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ కేజే రమేష్‌ వెల్లడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన విభాగం 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మూడో రోజు శుక్రవారం ఆయన దేశంలో వాతావరణ పరిస్థితులపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.


‘విపత్తుల విలయాలకు సంబంధించి హై రిస్క్‌ జోన్‌లో ఉన్న రాష్ట్రాల్లో అసోం అగ్ర స్థానంలో ఉంటే.... తెలుగు రాష్ట్రాలు ఆతర్వాత స్థానంలో ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే... భారీ వర్షాలు కురిసే రోజుల సంఖ్య ఏపీలో ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెరుగుతుంది. ఉమ్మడి విశాఖపట్నం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో తగ్గుతుందన్నారు.


వరదలు, కరువు, తుఫాన్లతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలు అధికంగా ప్రభావితమవుతున్నాయని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల కురిసే రోజుల సంఖ్య 38 నుంచి 43 వరకు ఉండగా... రాయలసీమలో 21నుంచి 25 రోజులు వరకు నమోదవుతోందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా 2000 ఏడాది నుంచి ఈ విపత్తుల తీవ్రత పెరుగుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated at - Sep 21 , 2024 | 04:34 PM