ఆఊరి నిండా సమాధులే వింత గ్రామం..

ABN, Publish Date - Dec 04 , 2024 | 12:16 PM

కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి పంచాయతీ పరిధిలో ఆయ్యకొండ ఉంది. పేరుకు తగ్గట్టుగానే కొండమీద ఈ గ్రామం వెలసింది. ఇక్కడ సుమారు వంద ఇళ్లు.. 3 వందల వరకు జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా సమాధులే దర్శనమిస్తుంటాయి. పూర్వీకులను దేవుళ్లుగా పూజించి సమాధుల ముందు నిత్య నైవేధ్యాలు పెడతారు.

కర్నూలు జిల్లా: ఆ గ్రామం నిండా సమాధులు.. ప్రతి ఇంటి ముందు కనీసం ఒక సమాధి ఉంటుంది. తమ పూర్వీకులను దేవుళ్లుగా భావించి పూజిస్తారు. ఆ సమాధుల మద్యలో పిల్లలు ఆడుకుంటారు. బడి, గుడి అన్న తేడా లేదు. గ్రామం మధ్యలో సమాధులు ఉన్నాయా.. సమాధుల మధ్య గ్రామం ఉందా.. అని అర్థం కాని పరిస్థితి అక్కడ వారెవరూ పట్టి మంచాల మీద పడుకోరు. పడుకుంటే కీడు జరుగుతుందంట.. ఇంతకీ ఆ వింత గ్రామం ఎక్కడుంది... ఏంటా కథ..


కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి పంచాయతీ పరిధిలో ఆయ్యకొండ ఉంది. పేరుకు తగ్గట్టుగానే కొండమీద ఈ గ్రామం వెలసింది. ఇక్కడ సుమారు వంద ఇళ్లు.. 3 వందల వరకు జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా సమాధులే దర్శనమిస్తుంటాయి. పూర్వీకులను దేవుళ్లుగా పూజించి సమాధుల ముందు నిత్య నైవేధ్యాలు పెడతారు. ఇంట్లో ఏం వండినా ముందు దేవుడికి.. ఆ తర్వాత సమాధుల వద్ద పూర్వీకులకు పెట్టిన తర్వాతే ఇంట్లో వాళ్లు తినాలి. లేదంటే కీడు జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం. ఏ వస్తువు కొనాలన్నా.. చివరికి పెన్షన్ తెచ్చుకోవాలన్నా.. కొండ దిగాల్సిందే. కాన్పు తర్వాత కూడా బాలింతలు మంచాలపై పడుకోరని గ్రామస్తులు చెబుతున్నారు.


ఈ గ్రామంలో చాలా వింత ఆచారాలు ఉన్నాయి. ఇక్కడివారు ఈ ఊళ్లోవాళ్లనే పెళ్లి చేసుకోవాలి. బయట సంబంధాలు చేసుకోరు. ఇక్కడ అందరూ కష్టపడి పనిచేస్తారు. వారిలో 80 శాతం మందికి కొండ కింద భూములున్నాయి. కొర్రలు, సజ్జలు, వెరుసెనగ, మిరప, ఉళ్లి వంటి పంటలు పండిస్తారు. తెల్లవారుజామునే పొలం పనులకు వెళ్లి.. సూర్యుడు అస్తమించకముందే గ్రామానికి చేరుకుంటారు. ఒకప్పుడు తమకు కరెంటు కూడా ఉండేది కాదని కొంత కాలం క్రితమే తమకు కరెంట్ వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ బంధువుల్లో నోటీసుల కలకలం..

రాజధాని నివాసిగా ఏపీ సీఎం చంద్రబాబు

కోహ్లీకి గాయం.. రెండో టెస్ట్‌కు డౌట్..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో టీం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 04 , 2024 | 12:20 PM