ఓ కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి కాపాడిన ఆర్మీ

ABN, Publish Date - Aug 04 , 2024 | 07:53 AM

కేరళ: వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైనికులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రిస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కేరళ: వయనాడ్‌లో కొండ చరియలు (Wayanad Landslides ) విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు, సైనికులు (Army) సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రిస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని (Tribal family) రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కల్పేట ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడుతున్నా.. సహాయక బృందం సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకుని ఉండడాన్ని సహాయక బృందం గమనించింది. వారిని కాపాడాలనే ఉద్దేశంతో నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సాయంతో కొండపై చేరుకుని గుహలో చిక్కుకున్న గిరిజన కుటుంబాన్ని కాపాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు...

రణమా... రాజకీయమా?

ఎముకలే లేని 8 జీవులు ఇవే...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 04 , 2024 | 07:54 AM