ఆ పని చేసేందుకు ఇదే చివరి అవకాశం..
ABN, Publish Date - Nov 14 , 2024 | 10:00 PM
మీరు మీ పాన్ కార్డు(PAN Card)ను ఆధార్ కార్డు(Aadhaar Card)కు లింక్ చేశారా, లేదా?. చేయకుంటే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఆధార్, పాన్ లింక్‌ను తప్పరిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మీరు మీ పాన్ కార్డు (PAN Card)ను ఆధార్ కార్డు (Aadhaar Card)కు లింక్ చేశారా, లేదా?. చేయకుంటే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఆధార్, పాన్ లింక్‌ను తప్పరిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, మీరు డిసెంబర్ 31లోపు మీ పాన్ కార్డును ఆధార్‌కు లింక్ చేయకుంటే.. మీ పాన్ కార్డ్ పని చేయకపోవచ్చు. వినియోగదారు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా, ఆర్థిక మోసాలను నిరోధించే లక్ష్యంతో ఈ ఆదేశాలను కేంద్రం జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు లింక్ చేసుకునేందుకు గడువు పెంచుతూ అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఇచ్చిన డేట్ చివరిదయ్యే అవకాశం ఉందని సమాచారం. అందుకే వీలైనంత తొందరగా ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Updated at - Nov 14 , 2024 | 10:00 PM